Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దామాషా ప్రకారమే దేశీయ బొగ్గు సరఫరా

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ
న్యూదిల్లీ : ఏదైనా లోటును భర్తీ చేసేందుకు దామాషా ప్రాతిపదికన కాకుండా బొగ్గును సరఫరా చేయడం సాధ్యం కాదని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. దేశంలో బొగ్గు సరఫరా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, కాప్టివ్‌ కోల్‌ మైన్స్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌), సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) నుండి లభించే దేశీయ బొగ్గు ఆధారంగా తగినంత బొగ్గు సరఫరా, బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర జెన్‌కోలు, ఐపీపీలు (స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారులు), కేంద్ర జెన్‌కోలతో సంప్రదించి మంత్రిత్వ శాఖలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, అన్ని జెన్‌కోలకు సీఐఎల్‌, ఎస్‌సీసీఎల్‌ నుండి పొందే బొగ్గుకు దామాషా ప్రకారం దేశీయ బొగ్గు సరఫరా జరుగుతుందని వివరించింది. ఏదైనా లోటును భర్తీ చేయడానికి దామాషా ప్రాతిపదికన కాకుండా ఎక్కువ బొగ్గును ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దేశీయ బొగ్గు సరఫరాను పెంపొందించేందుకు ప్రాధాన్యతపై కొన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ముందుగా, విద్యుత్‌ ప్లాంట్లకు కేటాయించిన క్యాప్టివ్‌ బొగ్గు గనులలో ఉత్పత్తిని మంత్రిత్వ శాఖ అనుమతించిన పరిమితికి పెంచవచ్చని తెలిపింది. రెండవది, రాక్‌ల నుండి బొగ్గును వెంటనే అన్‌లోడ్‌ చేయడంలో జాప్యం ఉన్నట్లయితే, అటువంటి విద్యుత్‌ ప్లాంట్‌లకు తక్కువ సంఖ్యలో రేక్‌లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అందుబాటులో ఉన్న రైల్వే రేక్‌ల వినియోగాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకునేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వివరించింది. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పర్యవేక్షించడం, బొగ్గు దిగుమతికి ఇచ్చిన నియమావళిలో ఉండేలా చూసుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా అనేక విద్యుత్‌ ప్లాంట్లు రైల్వే రాక్‌ల నుండి బొగ్గును దిగుమతి చేయడానికి సాధారణకంటే ఎక్కువ సమయం తీసుకుంటుండటం తిరిగే సమయంపై ప్రభావాన్ని చూపుతున్నట్లు వెల్లడిరచింది. విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు దిగుమతి చేసే సమయాన్ని పర్యవేక్షించాలని కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) ని కోరింది. మూడవది, బొగ్గు కంపెనీలకు అనేక ఉత్పాదక సంస్థలు కొన్ని వందల కోట్ల రూపాయల్లో బకాయిలు పడి ఉన్నాయి. ఇంత భారీ బకాయి మొత్తం బొగ్గు కంపెనీల సరఫరాను కొనసాగించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల, బొగ్గు కంపెనీల బిల్లులను నిర్ణీత సమయంలో చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే తగినన్ని ఇంధన నిల్వలను నిర్వహించకపోవడం లేదా ఏదైనా సాకుతో లభ్యత ఇవ్వకపోవడం (దిగుమతి చేసుకున్న బొగ్గు అధిక ధర మొదలైనవి) క్షమించరానిది అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అసాధారణ పరిస్థితులలో ఉత్పత్తిని నిర్ధారించడానికి విద్యుత్‌ చట్టం 82003 చట్టబద్ధమైన నిబంధనలను ఉపయోగించడం, అంతర్‌-రాష్ట్ర ప్లాంట్‌ విషయంలో అవసరమైన ఏదైనా జోక్యానికి మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img