Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

నాల్కో ప్రైవేటీకరణ వద్దు

ప్రధాని మోదీకి సీపీఐ నేత డి.రాజా లేఖ

న్యూదిల్లీ : నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్‌ఈ)ల్లో ఒకటయిన జాతీయ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో) ప్రైవేటీకరణ చర్యలను వెనక్కి తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శనివారం విజ్ఞప్తి చేసింది. ‘ప్రైవేటీకరించడం ద్వారా నాల్కోలో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అమలుకు మీ ప్రభుత్వ విధ్వంసకర ప్రణాళికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కింద నాల్కో నవరత్న కంపెనీగా ఉంది. జనవరి 7, 1981లో ఏర్పాటయిన నాల్కో ఈ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ కంపెనీ గత 40 ఏళ్లుగా అల్యూమినియం ఉత్పత్తి చేస్తోంది. అధిక నాణ్యత కలిగిన అల్యూమినియం ఎగుమతి చేపడుతోంది. అయితే కార్మిక, ప్రజా వ్యతిరేక చర్య పట్ల ప్రత్యేకించి కార్మికులు, ప్రజల్లో తీవ్ర ఆగహ్రం ఉందన్న వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం.
ప్రారంభం నుండి ఉత్పాదకత, సాంకేతిక, ఆధునీకరణలో ఒక స్థిరమైన మార్గాన్ని కొనసాగిస్తూ లాభాలను ఆర్జిస్తూ వస్తోంది. దేశంలోని సీపీఎస్‌ఈలలో అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది. దేశానికి, రాష్ట్రానికి అలాగే వాటాదారులకు గణనీయమైన వాటా, డివిడెండ్లను అందజేస్తోంది. పై వాస్తవాలను గమనంలోకి తీసుకుని, కార్మికులు, ప్రజలు, దేశ విస్తృత ప్రయోజనాల కోసం నాల్కో ప్రైవేటీకరణ చర్యలను పునరాలోచించాలి’ అని డి.రాజా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img