Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

నిరుపేదలతో కూడిన సంపన్న దేశం మనది : నితిన్‌ గడ్కరీ

ప్రపంచంలో భారతదేశం ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచినప్పటికీ, ప్రజలు మాత్రం పేదలుగానే ఉన్నారని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వారంతా ఇప్పటికీ ఆకలి, నిరుద్యోగం, అధిక ధరలు, అంటరానితనం, కులతత్వంతో సతమతమవుతోందని అన్నారు. దేశంలో ధనిక – పేద వర్గాల మధ్య నానాటికీ అగాథం పెరిగిపోతోందని చెప్పారు. ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించేందుకు విద్య, ఆరోగ్యం, సేవా రంగాలపై దృష్టి సారించాలని చెప్పారు. భారత్‌ నిరుపేదలతో కూడిన సంపన్న దేశం అని అన్నారు. నాగపూర్‌ లో భారత్‌ వికాస్‌ పరిషత్‌ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img