Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రధాని మోదీ తల్లి కన్నుమూత..ముగిసిన అంత్యక్రియలు.. సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్‌ కన్నుమూశారు. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. హీరాబెన్‌ మృతిపై అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. హీరాబెన్‌ మోదీ అనారోగ్యంతో తమ ఆస్పత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు మరణించినట్లు వెల్లడిరచింది. ఎప్పుడూ ప్రభుత్వ, రాజకీయ, విదేశీ పర్యటనలతో బిజీగా ఉండే మోదీ.. సమయం దొరికినప్పుడల్లా గుజరాత్‌లోని గాంధీ నగర్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లి ఆమెను కలుస్తూ ఉంటారు. తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఇటీవలే హీరాబెన్‌ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. తన తల్లి ఫొటోను షేర్‌ చేస్తూ.. నిండునూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.
కాగా నేడు ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాతృమూర్తి చితికి మోడీ నిప్పంటించారు. చివరిసారిగా చేతులు జోడిరచి అంతిమ నివాళులర్పించారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లికి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రంలో భాగంగా మోడీ తన మాతృమూర్తి పాడె మోశారు. వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. గాంధీనగర్‌లోని సెక్టార్‌ 30 స్మశాన వాటిలో జరిగిన అంతిమక్రియల్లో మోడీ కుటుంబ సభ్యులతోపాటు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img