Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ప్రైవేటీకరణ వద్దు.. ప్రజా సంక్షేమమే ముద్దు

జంతర్‌మంతర్‌ వద్ద కార్మిక `మహిళా సంఘాల ప్రదర్శన

న్యూదిల్లీ : కేంద్రప్రభుత్వ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపుమేరకు సోమవారం భారత్‌ బంద్‌కు కేంద్ర కార్మిక, మహిళా సంఘాలు సంఫీుభావం తెలిపాయి. బంద్‌కు మద్దతుగా దేశరాజధానిలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించాయి. ప్రైవేటీకరణ వద్దు అని ప్రజాకార్మికకర్షక సంక్షేమమే ముద్దు అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్రప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, టీయూసీసీ, ఎంఈసీ, హెచ్‌ఎంఎస్‌, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐయూటీయూసీ, ఏఐకేఎస్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ దిల్లీ, ఐద్వారాతో పాటు అనేక సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌, ఏఐసీసీటీయూ నేత సంతోశ్‌ రాయ్‌, హరీశ్‌ త్యాగి (ఏఐయూటీయూసీ), హన్నన్‌ ముల్లా (ఏఐకేఎస్‌), హెచ్‌ఎస్‌ సిద్ధూ (హెచ్‌ఎంఎస్‌) తదితరులు ప్రసంగిస్తూ పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని, ఆహార వ్యవస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, కొత్త సాగు చట్టాలను, కేంద్ర కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. కోవిడ్‌ కష్టాల్లో ఉన్న ప్రజలపై ధరలు, పన్నుల పేరిట అదనపు భారాలు మోయవద్దని కోరారు. ఆందోళనలో పాల్గొన్న ప్రముఖుల్లో ఏఐటీయూసీ దిల్లీ నేతలు ముకేశ్‌ కశ్యప్‌, రామ్‌రాజ్‌, సీఐటీయూసీ నేత అనురాగ్‌ సక్సేనా, సీపీఐ దిల్లీ కార్యదర్శి ప్రొఫెసర్‌ దినేశ్‌ వర్షనే, సీపీఐ పశ్చిమ దిల్లీ జిల్లా కార్యదర్శి శంకర్‌లాల్‌, సీపీఐ ఉత్తర దిల్లీ జిల్లా కార్యదర్శి సంజీవ్‌ రాణా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ దిల్లీ ఉపాధ్యక్షుడు ఓంవతి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img