Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఫేస్‌బుక్‌ పేరు మార్పు…ఇక ‘మెటా’

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ కంపెనీ పేరు మార్చుతున్నట్లు సంస్థ సీఈవో జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. కంపెనీ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడిరచారు. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోయే మెటావర్స్‌ సాంకేతికత మీదుగా ఫేస్‌బుక్‌కు ‘మెటా’ అని పేరు మార్చినట్టు ప్రకటించారు. అయితే ఫెస్‌బుక్‌తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్ట్రాగ్రాం, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉంటుందన్నారు. వర్చువల్‌/ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీలో వినియోగదారులు సంభాషించుకొనేలా ఫేస్‌బుక్‌ త్వరలో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని మెటావర్స్‌గా చెప్తున్నారు. కాగా దశాబ్ద కాలంగా సోషల్‌ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైంది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజల జీవనంలో సోషల్‌ మీడియా భాగమైంది. అందులో ఫేస్‌బుక్‌ ప్రధానమైంది. కాగా, ఫేస్‌బుక్‌ పేరు మార్పు సోషల్‌ మీడియా విభాగంలోనే కీలక పరిణామంగా నెటిజెన్లు చెప్పుకుంటున్నారు.గత కొంతకాలంగా ఫేస్‌బుక్‌ వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాల్లో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఫేస్‌బుక్‌ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img