Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బంద్‌ విజయవంతం

కంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన బంద్‌ జరిగింది. దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు అనూహ్య స్పందన లభించిందని సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ భారత్‌ బంద్‌కు ఇంత మద్దతు లభించలేదని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలే అన్నారు. 25 కి పైగా రాష్ట్రాలలో బంద్‌ విజయవంతమైందని అయన వెల్లడిరచారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాజస్థాన్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రల్లోనూ బంద్‌కు మద్దతు లభించిందని తెలిపింది. బంద్‌ సందర్భంగా అనేక జాతీయ, రాష్ట్ర రహదారులు మూత పడ్డాయి. అనేక మార్గాలలో ట్రాఫిక్‌ ను మళ్లించాల్సి వచ్చింది. బంద్‌ ప్రభావం రైళ్ళపై కూడా పడిరది. ఇదిలా ఉండగా ప్రదర్శన సమయంలో ఢల్లీి-సింఘు సరిహద్దులో ఒక రైతు మరణించాడు. అతను గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. మరణించిన రైతును భాగెల్‌ రామ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img