Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బీజేపీ మతతత్వ రాజకీయాలు సాగవు : మాయావతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలకు తెరలేపిందిని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికలకు ముందుగానే హిందు`ముస్లింల మధ్య విభజన రాజకీయాలతో పబ్బం గడుపుకోవడానికి మతతత్వ అజెండాను ముందుకు తెస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి శూన్యమని ప్రజలందరూ గ్రహించారని గురువారం ఆమె ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలోనే మరోసారి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయాత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం తీవ్రంగా పడిపోయిందని, పేదలు మరింత పేదలుగా మారిపోయారని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండే బీజేపీ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ చెబుతున్న అభివృద్ధి మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఇందుకు రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదికే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు నిత్యం మోసపోరని, వారి మానసిక స్థితిలో చాలా మార్పు వచ్చిందని, బీజేపీ మతతత్వ రాజకీయాలను సాగనివ్వరని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img