Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.వరుసగా రెండవరోజు కొత్త కేసులు 20వేల దిగువనే నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా నిన్న 16,051 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 206 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడిరచింది. దేశంలో 2,02,131 కేసులు (0.47%) యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,21,02,434 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,12,109 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడిరచింది. కాగా.. నిన్న కరోనా నుంచి 37,901 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,21,24,284కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,75,46,25,710 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. గత 24 గంట్లో 7లక్షల 706 మందికి వ్యాక్సిన్‌ డోసులను అందించినట్లు కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img