Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

మహిళా రాజకీయ సాధికారతపై ప్రధాని నోరు మెదపరే

నిలదీసిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా

హైదరాబాద్‌ : మహిళా రాజకీయ సాధికారత అంశంలో ప్రధాని మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐ డబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి డి.అనీరాజా నిలదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్స రాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టక పోవ డం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మహిళా రిజర్వే షన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఆశించిన స్థాయిలో మహిళల అభివృద్ధి, పురోగతి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి మఖ్దుం భవన్‌లో గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మోదీ ప్రసంగం కేవలం మహిళలకు రక్షణ, భద్రత అంశానికే పరిమితమైందనీ, చట్ట సభల్లో భాగస్వా మ్యంపై నోరువిప్పకపోడం మహిళలను తీవ్ర అసం తృప్తికి గురిచేసిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు చట్టసభలలో మహిళల భాగ స్వామ్యం విషయమై మాట్లాడుతున్నప్పటికీ పార్ల మెంట్‌లో బిల్లు అంశం వచ్చే సరికే స్పందించడం లేదన్నారు. 75 సంవత్స రాల స్వాతంత్య్రం తర్వాత కూడా పార్లమెంట్‌లో కేవలం 14 శాతం మహిళలే ఉన్నారన్నారు. మన చుట్టపక్కల దేశాల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా మహిళ లకు పార్లమెంట్‌ ద్వారాలు తెర వాలన్నారు. మోదీ రాజకీయ, సామాజిక చిత్తశుద్ధికి మహిళా రిజర్వేషన్‌ బిల్లు పరీక్ష లాంటిదన్నారు. రాజకీయ, సామాజిక అంశంలో క్షేత్రస్థాయిలో మహిళల పరిస్థితులపై మోదీ ప్రభుత్వా నికి అవగాహన లేదన్నారు. విద్యా, ఉపాధి రంగంలో మహిళలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, మహిళలకు ప్రాథమిక హక్కులు కూడా అందడం లేదన్నారు. కరోనా నేపథ్యంలో బాలికలు విద్య నుంచి డ్రాప్‌ అవుతున్నార న్నారు. మహిళలు ఆరోగ్యం విషయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, సిబ్బంది కొరత కూడా ఉందని చెప్పారు. మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్గానిస్తాన్‌ మహిళలకు సమాన హక్కులు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఉపాధ్యక్షులు డాక్టర్‌ రజని మాట్లాడుతూ ఆడ శిశువులకు జన్మనిస్తున్న మహిళలను పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు కూడా మనుషులేనని, ఆఫ్గానిస్తాన్‌ సమాన అవకాశాలు, హక్కులు కల్పించాల న్నారు. మహిళలకు మహిళలే శత్రువులుగా చూపే టీవీ సీరియల్స్‌ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు కృష్ణకుమారి, రాష్ట్ర నాయకులు గ్యార యాదమ్మ, నాయకులు గిరిజ, అశ్విని, అంజుమ్‌, మహేశ్వరి, హైమావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img