Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మోదీకి నిరసన సెగ

ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్న నిరసనకారులు

పంజాబ్‌కు వెళ్తుండగా ఘటన
ఫ్లైఓవర్‌పై 20 నిమిషాలు నిలిచిన వైనం
తిరిగి ఎయిర్‌పోర్టుకు కాన్వాయ్‌
భద్రతా వైఫల్యంపై హోంశాఖ ఆగ్రహం
పూర్తి నివేదిక ఇవ్వాలని పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశం

ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్‌ పర్యటనలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకు న్నాయి. మోదీ ఫిరోజ్‌పూర్‌ సభకు నిరసన సెగ తగలింది. దీంతో సభను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. మోదీ వెళ్లే మార్గంలో రైతులు రోడ్డును దిగ్బంధించడంతో 20 నిమిషాలపాటు ఓ ఫ్లైఓవర్‌పైనే మోదీ కాన్వాయ్‌ నిలిచిపోయింది. ఆయన తిరిగి దిల్లీ వెళ్లిపోయారు. పంజాబ్‌ ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ మండిపడిరది. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. వరుస ఓటములతో కుంగిపోయిన కాంగ్రెస్‌ పార్టీ ప్రధానిపై భౌతికదాడికి యత్నించిందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మోదీ సభలను అడ్డుకుంటోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించగా, ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకోవడం కాంగ్రెస్‌ కుట్రేనని, ఇందుకు కాంగ్రెస్‌ పెద్దలు క్షమాపణ చెప్పాలని హోంమంత్రి అమిత్‌షా డిమాండ్‌ చేశారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. జనం లేక మోదీ ర్యాలీని రద్దు చేసుకొన్నారని ఎద్దేవా చేసింది. పంజాబ్‌కు ప్రధాని రావాలని, ఇక్కడ భద్రతా సమస్య లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img