Monday, May 6, 2024
Monday, May 6, 2024

రసాయనశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి

రసాయనశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. జర్మనీకి చెందిన బెంజమిన్‌ లిస్ట్‌, అమెరికాకు చెందిన డేవిడ్‌ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు కెమిస్ట్రీ నోబెల్‌ ఇస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ప్రకటించింది.అణువులను నిర్మించడానికి అసిమెట్రిక్‌ ఆర్గానోకాటలిసిస్‌ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లిస్ట్‌, మెక్‌మిలన్‌లకు దక్కింది. లిస్ట్‌, మెక్‌మిలన్‌ల ఆవిష్కరణ ఫార్మాసూటికల్‌ పరిశోధనలపై గొప్ప ప్రభావం చూపించిందని, రసాయన శాస్త్రాన్ని పర్యావరణ హితంగా మార్చిందని అకాడమీ తన ప్రకటనలో పేర్కొంది. విజేతలకు 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీని సమానంగా పంచుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img