Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడిరది. జూలై 19న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు షెడ్యూలు ప్రకారం ఆగస్టు 13 వరకు జరగవలసి ఉంది. కానీ గత రెండు వారాల నుంచి విపక్షాలు సభలో ఆందోళన సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సభా కార్యక్రమాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కాసేపటికే సభ నిరవధికంగా వాయిదా పడిరది. ఈ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లుల్లో ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌, కొబ్బరి బోర్డు, పన్ను చట్టాలు, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ, ఓబీసీలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు జరిగిన తీరుపై సభాపతి ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సెషన్‌లో ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు జరగకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మరోవైపు ఇవాళ రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img