Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విజృంభిస్తోన్న కరోనా

180 మందికి పైగా వైద్యులకు పాజిటివ్‌
దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌, రోజువారీ పెరుగుతున్న కేసులు కరోనా సెకండ్‌ వేవ్‌ నాటి రోజులను గుర్తుచేస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌, బీహార్‌లలో 180 మందికి పైగా వైద్యులు కరోనా బారినపడటం ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల్లో పశ్చిమబెంగాల్‌లోని మూడు వేర్వేరు ఆసుపత్రులకు చెందిన వంద మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడిరచారు. వీరందరినీ సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాంటాక్టు ట్రేసింగ్‌ ప్రారంభించామని, ఈ మూడు ఆసుపత్రుల్లోని ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మరోపక్క బీహార్‌లోని పట్నాలో నలంద వైద్య కళాశాల, ఆసుపత్రికి చెందిన 87 మంది వైద్యులు కరోనా బారినపడ్డారు. చాలామంది బాధితులకు లక్షణాలేమీ లేవని తెలిపారు. బాధితులను ఆసుపత్రిలోని క్యాంపస్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు పట్నా కలెక్టర్‌ తెలిపారు. వీరిలో ఐదుగురుని మాత్రం ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img