Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సర్కార్‌కు షాక్‌

జీవో నం.1కు బ్రేక్‌ !

23వరకు సస్పెండ్‌ చేసిన హైకోర్టు
తదుపరి విచారణ 20కి వాయిదా
హర్షం వ్యక్తం చేసిన రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.1ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. రహదారులపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ అత్యంత వివాదాస్పద జీవో నంబరు 1ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. దీనిపై అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రజాందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథó్యంలో ఈ జీవోని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దానిపై గురువారం విచారణ జరిగింది. పిటీషనర్‌ తరపున ప్రముఖ న్యాయవాది ఎన్‌ అశ్వినికుమార్‌, ప్రభుత్వ తరపున అడ్వకేట్‌ జనరల్‌ ఎల్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా? స్వాతంత్య్రానికి ముందైనా ఇలాంటి జీవో ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. బ్రిటీష్‌ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే స్వాతంత్య్ర పోరాటం జరిగేదా? మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ ఇలాంటి జీవో రాలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో పోలీస్‌ యాక్టు 30 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన హైకోర్టు, ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్‌ చేస్తూ, దీనిపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img