Friday, April 26, 2024
Friday, April 26, 2024

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

పెదకాకాని : పెదకాకాని మండల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢల్లీిలో నిరసనలు చేస్తున్న ఉద్యమకారులకు మద్దతుగా పెదకాకానిలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు పూనుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, రైల్వే, ఇంకా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చూస్తూ ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. 33 మంది స్టూడెంట్లు మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని, అప్పటినుంచి సుమారు లక్ష మంది కార్మికులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, ఈ దశలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసి కార్మికులకు అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించటం అన్యాయమన్నారు. కార్మికులందరూ ఏకధాటిగా పోరాటాలు కొనసాగించి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి దారిమళ్ళించిన నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5వ తేదిన విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొట్టు శ్రీనివాసరావు, చిట్టి, నాగేశ్వరరావు, సాంబశివరావు, మరియమ్మ, ఏసమ్మ, కోటేశ్వరమ్మ, దానియేలు, రబ్బాని, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img