Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉక్రెనియన్‌ కమ్యూనిస్టు యోధ యాబ్రోవా మృతి

ఉక్రెయిన్‌ : తూర్పు యూరప్‌ దేశమైన ఉక్రెనియన్‌ కమ్యూనిస్టు నాయకురాలు తమీలా యాబ్రోవా మరణించారు. ఉక్రెనియన్‌ కమ్యూనిస్టుల యూనియన్‌ అధ్యక్షురాలైన యాబ్రోవా ‘మార్క్సిజంఅధునికత’ జర్నల్‌ ప్రధాన సంపాదకురాలు. యాబ్రోవా మరణానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ) సెంట్రల్‌ కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆర్థికవేత్త అయిన యాబ్రోవా సోవియట్‌ యూనియన్‌లో పెట్టుబడీదారీ విధాన పునరుద్ధరణకు దారితీసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండిరచారు. సీపీఎస్‌యూ మార్క్సిస్టు వేదిక ఉద్యమానికి సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్టు ఉద్యమ పునర్వ్యవ వస్థీకరణకు తీవ్రంగా కృషిచేశారు. 1991 నుండి ఆమె ఉక్రెనియన్‌ కమ్యూనిస్టు యూనియన్‌ నాయకురాలుగా ఉన్నారు. 1995లో ఆమె సైద్ధాంతిక పత్రిక ‘మార్క్సిజంఅధునికత’ను ప్రచురణ ప్రారంభించారు. కేకేఈ చొరవతో ప్రారంభమైన కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల అంతర్జాతీయ సమావేశాలకు ఆమె మద్దతు ప్రకటించారు. అవకాశవాదం, సామాజిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేక పోరాటానికి ఆమె మద్దతు ప్రకటించారు. యూరోపియన్‌ కమ్యూనిస్టు ఇనీషియేటివ్‌, ఇంటర్నేషనల్‌ కమ్యూనిస్టు రివ్యూ రెండిరటికీ ఆమె తన సహకారాన్ని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img