Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒడెశా నుంచి మొక్కజొన్న ఎగుమతి

కీవ్‌: ఉక్రెయిన్‌లో పండిన 26వేల టన్నుల మొక్కజొన్నలను ఉక్రెయిన్‌ పోర్టు ఒడెశా నుంచి లెబనాన్‌లోని ట్రిపోలికి భారీ నౌకలో తరలించారు. దీనిని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ‘‘ప్రపంచానికి ఉపశమన దినం’గా అభివర్ణించారు. రష్యా యుద్ధం ప్రకటించిన ఐదు నెలల తర్వాత.. ఉక్రెయిన్‌ నుంచి ఆహార రవాణా నౌకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడిరది. టర్కీ, ఐక్యరాజ్యసమితి గత నెలలో రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ధాన్యం, ఎరువులు ఎగుమతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడంతో ఈ నౌకాయానం సాధ్యమైంది. ఒడెశా తీరం నుంచి రజోని నౌకలో తొలి రవాణా జరిగింది. సియెరా లియోన్‌కు చెందిన రజోనీ కార్గో షిప్‌లో మెక్కజొన్నను తరలిస్తున్నారు. జులై 22న కుదిరిన ఒప్పందం ప్రకారమే ఉక్రెయిన్‌ తీరం నుంచి ఆహార ధాన్యాలను తరలిస్తున్నారు. మంగళవారం ఇస్తాంబుల్‌కు ఆ నౌక చేరుకుంటుంది. అక్కడ తనిఖీ ముగిసిన తర్వాత లెబనాన్‌ వెళ్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img