Friday, April 26, 2024
Friday, April 26, 2024

క్యూబాకు ప్రపంచవ్యాప్తంగా సంఫీుభావం

వాషింగ్టన్‌ : క్యూబాపై అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా అమెరికాలోని సంఫీుభావ గ్రూపులు మద్దతుగా నిలిచాయి. అమెరికాలోని క్యూబన్లతోపాటు రెండు దేశాల మధ్య ఐక్యత కోసం వాషింగ్టన్‌ నుంచి కాలిఫోర్నియా వరకు ప్రదర్శనలు జరిగాయి. బ్రిడ్జెస్‌ ఆఫ్‌ లవ్‌ ప్రాజెక్టులో భాగంగా క్యూబన్‌ అమెరికన్లు వైట్‌హౌస్‌ ముందు లాపాయెట్‌ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. క్యూబాకు సంఫీుభావం ప్రకటిస్తూ 27,000 మందికిపైగా సంతకాలు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి విరాళాలు సేకరించామని ఈ సంఫీుభావ ఉద్యమం పేర్కొంది. వాషింగ్టన్‌లోని క్యూబా రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్యూబాపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనాలకు స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. కుటుంబ పునరేకీకరణ ప్రణాళికను తిరిగి స్థాపించాలని అమెరికన్లు క్యూబాకు స్వేచ్ఛగా ప్రయాణించాలని నొక్కి చెప్పారు. 60 లక్షలకుపైగా సిరంజ్‌లు క్యూబాకు పంపినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్యూబాలోని మారియెల్‌ పోర్టుకు 20 లక్షల సిరంజ్‌లు ఈ నెల 17న చేరాయి. అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 5 లక్షల డాలర్లకు పైగా విరాళాలు అందాయి. సిరంజ్‌ల కోసమే కాకుండా క్యూబాకు ఇతర అవసరాల కోసం కూడా విరాళాల సేకరణ కొనసాగిస్తామని గ్రూప్‌ సభ్యుడు మెదియా బెంజిమన్‌ తెలిపారు. కరోనా సంక్షోభ సమమంలో క్యూబా అనేక దేశాలకు వైద్యులను పంపి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన విషయాన్ని ఆమె పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img