Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూరప్‌కు గ్యాస్‌ నిలుపుదల : రష్యా

ఫ్రాంక్‌ఫర్ట్‌ : రష్యా నిలిపివేసిన నార్డ్‌స్ట్రీమ్‌ 1 పైప్‌లైన్‌ ద్వారా యూరప్‌కు పంపే సహజవాయువును తిరిగి ప్రారంభించేందుకు చేపట్టిన ప్రణాళికలను రద్దుచేసింది. నిర్వహణ సమయంలో నార్డ్‌ స్ట్రీమ్‌ 1 పైప్‌లైన్‌లో లోపాలను కనుగొనడంతో నిలిపివేసినట్లు ప్రకటించింది. గాజ్‌ప్రోమ్‌ తీసుకున్న ఈ నిర్ణయం శీతాకాలానికి ముందు ఇంధనాన్ని భద్రపరచడంలో యూరప్‌ ఇబ్బందులను మరింత కష్టతరం కానుంది. జర్మనీకి ప్రధాన గ్యాస్‌ సరఫరాలను తిరిగి ప్రారంభించడానికి రష్యా గడువును రద్దు చేసింది. బాల్టిక్‌ సముద్రం కింద నడుస్తున్న నార్డ్‌ స్ట్రీమ్‌ 1, నిర్వహణ కోసం మూడు రోజుల ప్రవాహం నిలిచిపోవడంతో శనివారం తిరిగి పనిచేయాల్సి ఉంది. అయితే పైప్‌లైన్‌ ద్వారా రష్యన్‌ గ్యాస్‌ ఎగుమతులపై ఆధిపత్యాన్ని కలిగిన గాజ్‌ప్రోమ్‌, కీలకమైన టర్బైన్‌లో చమురు లీక్‌ను పరిష్కరించే వరకు డెలివరీలను పునఃప్రారంభించలేమని శుక్రవారం తెలిపింది. సాధారణంగా నార్డ్‌ స్ట్రీమ్‌ 1 టర్బైన్‌లకు సేవలందించే సిమెన్స్‌ ఎనర్జీ, అటువంటి లీక్‌ వల్ల పైప్‌లైన్‌ ఆపరేట్‌ చేయకూడదని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు, సాధారణ కార్యకలాపాలు నార్డ్‌ స్ట్రీమ్‌ 1 నిర్వహణకు ఆటంకం కలిగించాయని మాస్కో ఆరోపించింది. బ్రస్సెల్స్‌ ఇది ఒక సాకు అని రష్యా ప్రతీకారం తీర్చుకోవడానికి గ్యాస్‌ను ఆర్థిక ఆయుధంగా ఉపయోగిస్తోందని పేర్కొంది. జర్మనీ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్‌ మైఖేల్‌ రోత్‌ ట్వీట్‌ చేస్తూ, ‘‘మనపై రష్యా చేస్తున్న మానసిక యుద్ధంలో భాగంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img