Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తాం

ఉక్రెయిన్‌కు ఈయూ హామీ యుద్ధం మధ్యలో కీలక సదస్సు
కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుగుతున్న వేళ యూరోపియన్‌ యూనియన్‌`ఉక్రెయిన్‌ సదస్సు కీవ్‌లో జరిగింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు ఈ సందర్భంగా ఈయూ ప్రకటించింది. ఈనెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంవత్సరం పూర్తి అవుతుందని, ఈ సందర్భంగా తమ ఆంక్షల పదవ ప్యాకేజిని రష్యాపై విధించాలని భావిస్తున్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ ఉన్నతాధికారులు, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వోన్‌ డెర్‌ లెనెన్‌ తెలిపారు. ఆమెతో పాటు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు చార్లెస్‌ మైఖెల్‌ నేతృత్వంలో 15 మంది ఈయూ కమిషనర్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్‌స్కీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సదస్సుతో తమ సహకార బంధం మరింత పటిష్టమవుతుందని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వంపై త్వరలోనే నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి యూరోపియన్‌ కమిషన్‌ షరతులకు ఉక్రెయిన్‌ అంగీకరించే తదుపరి ఎలా ముందుకు సాగాలో నిర్ణయిస్తామని చెప్పారు. రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని ఉర్సుల నొక్కిచెప్పారు. మరికొన్ని ఆంక్షలను ఆ దేశంపై ఈయూ విధిస్తుందని జెలెన్‌స్కీకి హామీనిచ్చారు. ‘ఇప్పటికే రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. మా ఆంక్షలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. 24 ఫిబ్రవరికి ఈ యుద్ధానికి కచ్చితంగా ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా ఆంక్షల పదవ ప్యాకేజిని విధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఆమె చెప్పారు. అయితే ఏయే రంగాలపై ఆంక్షలు ఉంటాయి… ఎగుమతులను లక్ష్యంగా చేసుకుంటారా వంటి వివరాలివ్వలేదు. రష్యాపై యూరప్‌ ఆంక్షల గతి తగ్గిందని, దీనిని పెంచాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తిచేయగా ఉర్సులా పై విధంగా స్పందించారు. అలాగే ఉక్రెయిన్‌కు అన్ని విధాలా సహకరిస్తామని, తమ మార్కెట్లకు టారిఫ్‌ రహిత ప్రవేశాన్ని కల్పిస్తామని చెప్పారు. అంతకంటే ముందు ఈయూ సభ్యత్వం కోసం పెట్టుకున్న దరఖాస్తులో యూరోపియన్‌ కమిషనర్‌ షరతలకు ఉక్రెయిన్‌ అంగీకరించాల్సి ఉంటుందని, మరిన్ని విషయాల్లోనూ స్పష్ట త వచ్చాక తదుపరి కార్యాచరణను ఈయూ నిర్ణయిస్తుందని యూరోపియన్‌ కమిషనర్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img