Friday, April 26, 2024
Friday, April 26, 2024

రష్యాలో జపాన్‌ చట్టసభ సభ్యుల ప్రవేశం నిషేధం

మాస్కో: ఈ ఏడాది ఏప్రిల్‌లో పెద్ద సంఖ్యలో రష్యన్‌ చట్టసభ సభ్యులపై వ్యక్తిగత ఆంక్షలు విధించాలని జపాన్‌ తీసుకున్న నిర్ణయానికి ప్రతీకార చర్యగా రష్యా 384 మంది జపాన్‌ చట్టసభ సభ్యులకు ప్రవేశాన్ని నిషేధించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్‌ 398 మంది రష్యన్‌ వ్యక్తుల ఆస్తులను స్తంభింపజేసింది. వీరిలో ఎక్కువ మంది స్టేట్‌ డూమా సభ్యులు ఉన్నారు. దీనికి ప్రతీకారంగా జపాన్‌ నేషనల్‌ డైట్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు చెందిన 384 మంది సభ్యులకు జూలై 14 నుండి రష్యాలో ప్రవేశాన్ని నిరాకరించాలని నిర్ణయం తీసుకోవడమైందని ఆ ప్రకటన పేర్కొంది. జపాన్‌ అధికారులు రష్యాపై వ్యతిరేక వైఖరి తీసుకోవడంపై తాజా నిర్ణయం రష్యన్లు అమలు చేయనున్నారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ సందర్భంగా రష్యాపై జపాన్‌ ‘‘నిరాధార ఆరోపణలు’’ చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిపై జపాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌ 12న రష్యన్‌ వ్యక్తులు, సంస్థలపై అదనపు ఆంక్షలు విధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img