Friday, April 26, 2024
Friday, April 26, 2024

సోషలిజమే ప్రత్యామ్నాయం


టర్కీ సీపీ
ఇస్తాంబుల్‌ : ‘సోషలిజమే ప్రత్యామ్నాయం’ అనే నినాదంతో టర్కీ కమ్యూనిస్టు పార్టీ (టీకేపీ) 101వ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది. టీకేపీ చేపట్టిన ర్యాలీలో వేలాదిమంది ప్రజలు ఇస్తాంబుల్‌లోని కర్తల్‌ స్వ్కేర్‌లో సమావేశమయ్యారు. వాయిదా వేయ వద్దు.. సమయాన్ని కోల్పోకండి.. సోషలిజానికి సమయం ఆసన్నమైందంటూ ఉత్సాహభరితంగా టీకేపీ ప్రధాన కార్యదర్శి జనరల్‌ పిలుపునిచ్చారు. దేశంలో పేదరికం పెరిగిపోతోందని దోపిడీ తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దోపిడీకి వ్యతిరేకంగా 101 సంవత్సరా లుగా పోరాడే కుటుంబం మాది..ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యంకండి. టర్కీ భవిష్యత్తు. సోషలిజమే.. సోషలిజం సిద్ధాంత ప్రాతిపదిక పాలన మతపరమైన వ్యవహారాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయన్నారు. దోపిడీకి తావుండదన్నారు. జాత్యహంకారం నిర్మూలిస్తా మని హామీ ఇచ్చారు. బ్యాంకులు, కర్మాగారాలు, భూగర్బ వనరులు జాతీయం చేస్తామని కెమల్‌ ఒకుయాన్‌, డెర్సిమ్‌ మేయర్‌ ఫాతిప్‌ా మెహ్మెట్‌ పిలుపునిచ్చారు. శ్రమను దోపిడీ చేసే సామ్రాజ్యవాద శక్తులపై సోషలిజం ఆవశ్యకతను ప్రస్తుతించారు. అంతిమంగా సోషలిజమే విజయం సాధిస్తుందన్నారు. ఈ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన కళాకారులు హాజరయ్యారు. సోషలిజం ఆవశ్యకతను వక్తలు వ్యక్తం చేశారు. దేశంలో మూడవ ఫ్రంట్‌ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. టర్కీలోని కార్మికులు, ప్రజలు ప్రజా వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని ఒకుయన్‌ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మాణ కార్మికులు, మునిసిపాలిటీ కార్మికులు, వివిధ రంగాలకు చెందిన కార్మికలు ఈ సమావేశానికి తమ తోడ్పాటు పలికారు. బ్యానర్లు చేపట్టి ప్రజాపోరాటాలకు సంఫీుభావం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img