Friday, April 26, 2024
Friday, April 26, 2024

700 మిలియన్‌ డాలర్ల చైనా టీకాల సాయం

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు 700 మిలియన్‌ డాలర్ల కొవిడ్‌`19 టీకాలను చైనా సహాయంచేసింది. 100కిపైగా దేశాలకు కరోనాతో పోరాడేవారి ప్రాణాలు కాపాడేందుకు చైనా తన సహాయ, సహకారాలు అందించిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ పేర్కొన్నారు. చైనా వాక్సిన్‌ సహాయంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా పై వ్యాఖ్యలు చేశారు. చైనాపై నిందలు వేసి అపవాదులు చేసే దేశాలు మొదట తాము ప్రపంచంకోసం ఏమిచేశామని తమని తాము ప్రశ్నించుకోవాలని జావో స్పష్టం చేశారు. చైనా చేసిన సహాయాన్ని వాక్సిన్‌ దౌత్యం అని భావిస్తే…చైనా టీకా దౌత్యం అత్యంత ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజ ప్రయోజనాలకు చైనా దౌత్యం అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. అబద్ధపు దౌత్యం…అభాండాలు..అపవాదులతో కూడిన దౌత్య విధానాలకు స్వస్తి చెప్పి మహమ్మారి నియంత్రణకు ప్రపంచానికి ఆచరణాత్మకంగా ఏదైనా సహాయం చేసేందుకు తమ మనస్సును, శక్తిని కేంద్రీకరించాలని జావో సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img