Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

75ఏళ్ల తర్వాత అందుబాటులోకి బ్యాంకింగ్‌ సేవలు

సంబల్‌పూర్‌ : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు తర్వాత కూడా అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ పథకాలు అందని ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లాలోని కుద్‌ గుండేర్‌పూర్‌ గ్రామానికి స్వాతంత్య్రం బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహానది పాయలుగా విడిపోయిన ఒక దీవిలో కుద్‌ గుండేర్‌ఫూర్‌ ఉంది. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న ఐదు వేల జనాభాకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందవు. విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యాలను పొందడంలో అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చింది. గర్భిణీలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రా లకు చేరుకోవాల్సిన దుస్థితి. రైతులు వారి ఉత్పత్తులను విక్రయించడానికి, విత్తనాలను కొనుగోలు చేయడానికి పడవల్లో ప్రయాణించేవారు. అయితే ఈ ఊరి సమస్యలు సంబల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ దృష్టికి చేరాయి. అక్కడ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. 2015లో సంబల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ బల్వంత్‌ సింగ్‌ వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తైంది. దీంతో అక్కడ బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్కల్‌ గ్రామీణ బ్యాంకు అక్కడ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ను ప్రారంభించింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన 75ఏళ్లకు కుద్‌ గుండేర్‌ఫూర్‌ గ్రామానికి బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img