Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆకలి కోరల్లో యెమెన్‌

టెహ్రాన్‌ : 2015లో యెమెన్‌పై సౌదీ నేతృత్వంలోని విధ్వంసకర యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 19 మిలియన్లకు పైగా యెమెన్‌లు ఆకలితో అలమటిస్తున్నారని తాజా నివేదిక పేర్కొంది. యెమెన్‌లో ఆకలితో ఉన్న వారి సంఖ్య ఏడేళ్లలో అత్యధికంగా ఉందని, కొద్ది రోజుల్లోనే సహాయ కోత అమలవుతుందని యుఎన్‌ వెల్లడిరచింది. ‘‘కరవు అంచున ఉన్న 160,000 కంటే ఎక్కువ మంది19 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు’’ అని హ్యుమానిటేరియన్‌ అధికారి వెల్లడిరచారు. ‘‘నిధుల కోతలతో అవసరమైన వ్యక్తులకు సహాయం చేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయి.’’ నిధుల అంతరాయాల కారణంగా ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పీ) డిసెంబర్‌లో 8 మిలియన్ల మందికి ఆహార రేషన్‌లను తగ్గించగా గత నెలలో మరో రౌండ్‌ కోతలను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని తెలిపింది. దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు తమ రోజువారీ అవసరాలలో సగం కంటే తక్కువ పొందుతున్నారు 8 మిలియన్ల మంది వారి రోజువారీ అవసరాలలో మూడిరట ఒక వంతు కంటే తక్కువ మాత్రమే పొందుతున్నట్లు జిన్హువా నివేదించింది. వీరిలో 500,000 కంటే ఎక్కువ మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. యెమెన్‌లో 4 మిలియన్లకు పైగా ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు.150,000 మంది నిర్వాసితులకు , దాదాపు 100,000 మంది శరణార్థులకు నగదు సహాయం, ఆశ్రయం అవసరమైన వస్తువులను సహాయం చేసినట్లు యూనిసెఫ్‌ వెల్లడిరచింది. యెమెన్‌లోని పరిస్థితిని ప్రపంచంలోని ‘‘అత్యంత మానవతా సంక్షోభం’’గా యూనిసెఫ్‌ వర్ణించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img