Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆఫ్రికాలో మార్బర్గ్‌ వణుకు

గినియాలో తొలి మరణం
88శాతం డెత్‌రేట్‌ : డబ్ల్యూహెచ్‌ఓ

గినియా : కొవిడ్‌ మహమ్మారి వేళ ఆఫ్రికాను మార్బర్గ్‌ వైరస్‌ వణికిస్తోంది. పశ్చిమ ప్రాంతం గినియా దేశంలో తొలి మరణం నమోదు అయింది. ఎబాలాకు కజిన్‌ మార్బర్గ్‌ అని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. గినియాలోని గుక్కెడో ప్రిఫెక్చర్‌లో మరణించిన వ్యక్తి ద్వారా సేకరించిన నమూనాలలో ఈ ప్రాణాంతక వైరస్‌ కనుగొన్నట్లు తెలిపింది. వ్యాధి లక్షణాలు కనిపించిన ఎనిమిది రోజుల తర్వాత అతను చనిపోయినట్లు వెల్లడిరచింది. ముగ్గురు కుటుంబ సభ్యులు సహా 150 మంది కాంటాక్స్‌ను గుర్తించినట్లు తెలిపింది. గబ్బిలాల ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి సోకితే 88 శాతం వరకు మరణాలు సంభవించవచ్చునని చెప్పింది. మార్బర్గ్‌ వైరస్‌ చాలా ప్రమాదకరమైందని, ఇది చాలా దూరం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తొలి దశలోనే నిలువరించాలని ఆఫ్రికా డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ మత్షిడిసో మోయిటి వెల్లడిరచారు. గినియాలో గతేడాది ఎబోలా బారిన పడి 12 మంది చనిపోయారు. దానిని అరికట్టారో లేదో మార్బర్గ్‌ హడలెత్తిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్‌ ఆనవాళ్లు లభించడం ఇదే మొదటిసారిగా తెలిపింది. ఇది అంత్యంత ప్రమాదకర వ్యాధిగా చెబుతున్న డబ్ల్యుహెచ్‌ఓ.. ఆఫ్రికాతోపాటు జర్మనిలోనూ ఈ వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయని పేర్కొంది. ఈ వైరస్‌ కేసులు పెరిగి భారీస్థాయిలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చిరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img