Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

యుద్ధాలకు కారకులు సామ్రాజ్యవాదులే

ఏథెన్స్‌ : అఫ్గాన్‌లో నెలకొన్న సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధాలకు గ్రీక్‌లోని అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయని గ్రీకు కమ్యూ నిస్టు పార్టీ (కేకేఈ) వెల్లడిరచింది. యుఎస్‌, నాటో, ఈయూల కపట నాటకాన్ని కేకేఈ తీవ్రంగా ఖండిరచింది. కేకేఈ ఎంపి కోస్టాస్‌ పాపాడకిస్‌ మంగళవారం ‘రియల్‌ ఎఫ్‌ఎమ్‌) రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా వ్యాఖ్యానించారు. కేకేఈ కేంద్ర కమిటీ సభ్యుడైన పాపాడకిస్‌ మాట్లాడుతూ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌లో 19801989 మధ్య కాలంలో మహిళల పరిస్థితిని మెరుగుపరచే విధానాలతో సహా అనేక ముఖ్యమైన సామాజిక విజయాలు సిద్ధించాయని గుర్తు చేశారు. మహిళల హక్కులకోసం మొసలికన్నీరు కార్చిన ప్రభుత్వాలు గత 20ఏళ్లలో అఫ్గాన్‌ను పూర్తిగా నిర్వీర్యంచేసారని, మహిళల హక్కులను కాలరాసారని పేర్కొన్నారు. అఫ్గాన్‌ ప్రజలకు వ్యతి రేకంగా తాలిబన్లను తయారుచేసిన ఘనత సామ్రాజ్యవాద దేశాల పోటీఫలితమేనని పపాడకిస్‌ పేర్కొన్నారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీలో భాగమని కోస్టాన్‌ అన్నారు. 20102011లో గ్రీస్‌ అఫ్గాన్‌కు 7 మిలియన్‌ యూరోలను ఇచ్చినట్లు తెలిపారు. గత సంవత్సరం ప్రస్తుత ప్రభుత్వం 3వేల యూరో లను ఇచ్చిందని అన్నారు. శరణార్థుల సమస్యపై కేకేఈ ఈయూ వైఖరిని ఖండిరచింది. ఈయూ విధానాల కారణంగానే అఫ్గాన్‌ ప్రజలు శరణార్థులుగా తరలిపోతున్నారని పాపాడకిస్‌ ఆవేదన చెందారు. మరోవైపు అఫ్గాన్‌లో నెలకొన్న అణచివేత చర్యలకు, సామూహిక బహిష్కరణలకు, జైలు శిబిరాలకు సామ్రాజ్యవాద దేశాల నిరంకుశ వైఖరని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img