Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సామ్రాజ్యవాదంపై గ్రీస్‌ ప్రజల నిరసన

ఏథెన్స్‌ : సామ్రాజ్యవాద యుద్ధంలో గ్రీస్‌ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ గ్రీస్‌లోని వివిధ పట్టణాల్లో 40వ మారథాన్‌ పీస్‌ మార్చ్‌ జరిగింది. ఈ మార్చ్‌లో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్‌ యుద్ధంలో గ్రీస్‌ ప్రమేయం, నాటోలో గ్రీస్‌ చేరడానికి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. థెస్సలొనీకీ, పెలోపొన్నీస్‌, థెస్సాలీ, ఎపిరస్‌, మాసిడోనియా, థ్రేస్‌లోని నగరాల్లో సామూహిక సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహించారు. సైనిక శిబిరాలు, స్థావరాల వెలుపల అనేక ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనకు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ(కేకేఈ) ప్రధాన కార్యదర్శి డిమిత్రిస్‌ కౌట్సౌంబస్‌, జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వద్ద జరిగిన భారీ ర్యాలీకి హాజరయ్యారు. అమెరికా`నాటో యుద్ధ ప్రణాళికలు ప్రజలను మరింత పేదరికంలోకి, అధిక ధరలు, ఆహార సంక్షోభం వైపు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సామ్రాజ్యవాద యుద్ధం దేశ సార్వభౌమాధికార హక్కులకు పెను ప్రమాదంగా మారిందని అన్నారు. సమస్యలపై ప్రజల సమన్వయ పోరాటమే ఏకైక పరిష్కారం, ఏకైక మార్గం, ఏకైక ఆశగా కౌట్సౌంబస్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img