Friday, April 26, 2024
Friday, April 26, 2024

టీబీ వ్యాధిగ్రస్తుల దత్తత

విశాలాంధ్ర` బొమ్మనహళ్‌ : మండలంలోని కురువల్లి గ్రామంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి టిబి ముక్త భారత్‌ అభియాన్‌ పథకంలో భాగంగా ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు క్షయ వ్యాధి గ్రస్తులని ఆరు నెలలు దత్తత తీసుకొని వారికి పౌష్ఠికాహారం అందించేందుకు గురువారం ప్రధానమంత్రి ముక్తాభారత అభియాన్‌ పథకం ప్రారంభించారు. అందులో భాగంగా టిబి యూనిట్‌ లో డాక్టర్‌ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో పసలూరు కాంతమ్మ సహకారంతో ముగ్గురు క్షయ గ్రస్తులను ఆరునెలల పాటు దత్తత తీసుకోవడం జరిగింది.వీరికి కావాల్సిన పౌష్ఠికాహారం, గుడ్లు అందించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇలా ఎవరైనా దాతలు దత్తత తీసుకోవడం కోసం ముందుకు రావాలని కోరుతూ, ఈ రోజు సహకారం అందించిన కాంతమ్మ కి అభినందనలు తెలిపారు. అలాగే టీవీ వ్యాధిగ్రస్తుల సర్వేలో పాల్గొని,జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, సూపర్వైజర్లు యుగంధర్‌ శ్రీనివాసులు, శారదమ్మ, ఎం ఎల్‌ హెచ్‌ పి రాధ,నాగేంద్ర,శ్రీకాంత్‌, వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img