Friday, April 26, 2024
Friday, April 26, 2024

తనిఖీలో 6 టన్నుల బియ్యం స్వాధీనం

విశాలాంధ్ర, శిరివెళ్ల :కర్నూలు జిల్లా శిరివెళ్ల మండల పరిధిలోని కోటపాడు వీరారెడ్డి పల్లె రహదారిలో పేదల బియ్యం అక్రమంగా తరలిపోతుండగా పోలీసులు అకస్మిక తనిఖీ చేసి బియ్యం, లారీని సీజ్‌ చేసి పౌరసరఫరాల శాఖకు అప్పంగించారు. అక్రమ రవాణాకు కారణమయిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. శిరివెళ్ల మండల పరిధిలో విచ్చలవిడిగా బియ్యం అక్రమ రవాణా కొనసాగుతుండడంతో పోలీసులు నిఘాపెట్టి పట్టుకున్నారు. ఆరు మాసాల్లో విజిలెన్స్‌, పోలీసుల దాడుల్లో మూడు సార్లు పట్టుబడిన అక్రమార్కుల వైఖరిలో మార్పు రాకపోవడం.. మరింత విస్తరించడంతో పోలీసులు దాడులు అధికం చేశారు. పేదల నుండి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆటోలు లారీల ద్వార పెద్ద మొత్తంలో బనగానపల్లె అడ్డాగా అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు సమాచారం.శిరివెళ్ల సబ్‌ ఎస్సై సూర్య మౌళి అక్రమంగా తరలిస్తున్న లారీని 50 కేజీల 120 బియ్యం బస్తాలు ఆరు టన్నులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు ఇద్దరిని విచారించారు.. అక్రమ రవాణాపై అరాతీసి పూర్తి సమాచారాన్ని రాబట్టిననట్లు తెలిసింది.బియ్యం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img