Friday, April 26, 2024
Friday, April 26, 2024

నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

విశాలాంధ్ర`ఆస్పరి : నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, మండల కార్యదర్శి రంగస్వామి లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వ్యవసాయ అధికారి ముణెమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం పత్తి కి మార్కెట్లో మంచి రేటు ఉండడం వల్ల ఈ సంత్సరం ఎక్కువగా రైతులు పత్తి పంట సాగుకు మొగ్గు చూపడం జరిగిందని, దీన్ని అదనుగా భావించిన పట్టివిత్తనాల కంపెనీలు జిల్లాలో 30 రకాల విత్తనాలకు పర్మిషన్‌ తీసుకోవడం జరిగిందన్నారు. కానీ జిల్లాలో 5 రకాలు విత్తనాలకు మంచి దిగుబడి వచ్చిందే తప్ప, మిగిలిన అన్ని రకాల పత్తి విత్తనాలు నాసిరకంగా పంట దిగుబడులు వచ్చాయన్నారు. నకిలీ విత్తనాలు వల్ల తీవ్రంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, ఎకరాకి 20వేలు పెట్టుబడి పెట్టిన పంట చేతికొచ్చే పరిస్తితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట ఏపూగా పెరిగిందే తప్ప ఐదు కాయలు కూడా లేవన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల పంట పొలాలను పరిశీలించి, నష్టపోయిన రైతులకు విత్తన కంపెనీల నుంచి ఏకారానికి 40వేలు పంట నష్టపరిహారం ఇవ్వలని, లేకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రామాంజినేయులు, రైతు సంఘం సీనియర్‌ నాయకులు మణిక్యప్ప, డీజిల్‌ లింగన్న, నారాయణ, శంకరబండ రాలింగుడు, గఫూర్‌ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img