Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పెద్దతుంబళం పీహెచ్చీలోనే కొనసాగించాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : బసలదొడ్డి గ్రామాన్ని పెద్దతుంబళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే కొనసాగించాలని గ్రామస్తులు బుధవారం పెద్దతుంబళం వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బసలదొడ్డి గ్రామం పెద్దతుంబళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే కొనసాగితుందన్నారు. ఇటీవల పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని పీహెచ్చీగా అప్ గ్రేడ్ చేసి బసలదొడ్డి గ్రామాన్ని అందులోకి చేర్చారన్నారు. తమ గ్రామాన్ని హెచ్ మురవణి పీహెచ్చీ నుండి తొలగించి పెద్దతుంబళం పీహెచ్చీలోనే కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. తమ గ్రామం నుంచి హెచ్ మురవణి గ్రామం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో రవాణా సౌకర్యాలు సక్రమంగా లేవని తెలిపారు. తమ గ్రామాన్ని పెద్దతుంబళం పీహెచ్చీకి సంబంధించిన 104 ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బసలదొడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img