Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యకు పెద్దపీట వేసిన ఏకైక సీఎం జగన్

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాలలో మండల విద్యాధికారిణి సువర్ణ సునియం ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. శాస్త్ర, సాంకేతికంగా విద్య అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబులు ఇస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి, విధ్యాదీవెన, విద్యావసతి తదితర పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని కొనియాడారు. నాడు – నేడు కింద కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అంతర్జాతీయంగా రాణించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టారన్నారు . మండలంలో మొత్తం 684 మంది విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీవిద్య, జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ సభ్యులు కుదే లక్ష్మీ, మాజీ ఎంపీపీ రఘురామ్, నాయకులు రవిచంద్రా రెడ్డి, శివరామరెడ్డి, గజేంద్ర రెడ్డి, జాము మూకన్న, అర్లప్ప, విద్యకమిటి చైర్మన్లు కోరి లింగన్న, అనిల్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రంగన్న, కేజీబీవీ ప్రత్యేక అధికారి చైతన్య స్రవంతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లక్ష్మన్న, సి ఆర్ పి లు లక్ష్మన్న, కృష్ణ, ఆచారి, పుష్పలత, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img