Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సిపిఐ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం

విశాలాంధ్ర- పెద్దకడబూరు : సిపిఐ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని బస్టాండ్ ఆవరణంలో సిపిఐ శాఖ కార్యదర్శి సర్దాజ్ పటేల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీపై కల్లుకుంట గ్రామానికి చెందిన రమేష్ చేస్తున్న ఆరోపణలను వారు ఖండించారు. గతంలో సర్వేనెంబర్ 175/బి, 174/1 లక్ష్మన్న, రమేష్ అనే వ్యక్తుల మధ్య వివాదాలు ఉన్నాయని, సిపిఐ పార్టీని ఆశ్రయించగా ఆ సమస్యపైన తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తే అధికారులు ఆ భూమిపైన వివాదాలు ఉన్నాయని అప్పట్లో ఆర్డీఓ తాహశీల్దార్ కు ఫోన్ చేసి రెడ్ మార్కులో పెట్టించారన్నారు. రమేష్ అనే వ్యక్తి లక్ష్మన్న 13 ఎకరాలు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాలు పొందారని, ఆ పట్టాలను రద్దు చేసి భూమిలేని నిరుపేదలకే దక్కాలని రమేష్ చెప్పడంతో పార్టీ జోక్యం చేసుకొని పోరాటం చేయడం జరిగిందన్నారు. ఇంతలోనే లక్ష్మన్న రమేష్ తో డబ్బులు ఇస్తా అని ఒప్పందం కుదుర్చుకొని సమస్యను పరిష్కరించాలని తాహశీల్దార్ కార్యాలయానికి వెళ్లగా రెవెన్యూ సిబ్బంది ఆ భూమి కోర్టులో ఉందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక రమేష్ అనే వ్యక్తి సిపిఐ నేతపైన డబ్బులు ఇచ్చానని అసత్య ఆరోపణలు చెయ్యడం మొదలు పెట్టాడని ఆరోపించారు. ఇది కేవలం భూ పోరాటాన్ని ఆపడానికే నాటకాలు ఆడుతున్నారని, ప్రభుత్వ భూమి పేదలకు చెందే వరకు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గేదే లేదని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డు పెట్టైనా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి జాఫర్ పటేల్, డోలు హనుమంతు,, బిఎంకేయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర, నాయకులు నాగేష్, గోపాల్, సీనియర్ నాయకులు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img