Friday, April 26, 2024
Friday, April 26, 2024

పంజరంలో ఆకాశం

లోహం ఏదైతేనేం
మోహం ఎవరిదైతేనేం
దేశం ఏదైతేనేం
ప్రదేశం ఎక్కడైతేనేం
వర్ణం సవర్ణమైతేనేం
పరిపరి పరిణామాల
రూపైక్యతా ఏకరూపం
అదే పంజరం…అనాదిగా
అన్ని కాలాల్లో
అన్ని దేశాల్లో
శూన్యాన్ని నింపే
వారికి… వారు సగమాకాశం
నాకెప్పుడూ సంపూర్ణాకాశం
ఆ ఆకాశమే పంజరంలో
ఎప్పుడో కాదు… ఇప్పుడూ
ఏనాడో కాదు…ఈనాడూ..
చలనరహిత ఆకాశం…
పంజరానికే పరిమితం
సహభూతాల అసహనం
అనేక రూపాల వికృతి
దిక్కుతోచని నిశ్చల ఆకాశదీపాలు…
అవని అంతటా అంధకారమే
స్థంభించిన మేఘం
శిలా సాదృశ్య జీవజలం
హరితం కోల్పోయిన వసుధ విశాలాకాశం కోల్పోయి స్వేచ్ఛాశిల అయిన వేళ కాన లాంటి లోకంలో విహంగాల విలవిల కారుణ్యం గడ్డకట్టిన వేళ కొడిగట్టిన వివేచన మరణ శయ్యపై మానవత్వం మూర్తీభవించిన మూర్ఖత్వం మరణ మృదంగనాదంతో మనిషి సృష్టిని చేతులారా ఛిద్రం చేస్తుంటే సగ శరీరం నిర్వీర్యం సజీవ సమాధిలో చైతన్యం అరణ్య రోదనం... జ్ఞానం. ఎంత అందంగా ఇంకెంత హృద్యంగా మరింత మురిపెంగా ఎంతెంతో ముద్దుగా అత్యంత మధురంగా అభివర్ణించినా పంజరం పంజరమే ఆకాశం ఆకాశమే పంజరంలో ఆకాశం ఎక్కడైతేనేం, ఎవరిదైతేనేం మౌడ్య కుడ్య కుహరాల్లో అహరహం కునారిల్లే కుత్సితులు వికాస కేతన ఖనన హనన ముష్కరులున్న మహిలో వెలుగు చూడలేని కలుగుల్లోని శశనాలకి కొలతలు, కొలమానాలు లేని కాలమానంలో కారు చీకటి తప్ప మిగిలిందేముంది. ఏ మానవీయ పునాదిపై ఈ నాగరికత పరిఢవిల్లినట్లు ఈ సంస్కృతి వికసించినట్లు జగాలు ఎన్ని మారితేనేం యుగాలు ఎన్ని గతిస్తేనేం మతాలే ఎన్ని ఉద్భవిస్తేనేం ఎక్కడి గొంగళి...అక్కడే (నేటి అఫ్ఘన్‌తో పాటు అన్నిచోట్లా సాగుతున్న స్త్రీ వివక్ష చూసి జుగుప్సతో...) లలితానంద్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img