Friday, April 26, 2024
Friday, April 26, 2024

బతుకంటే

కళ్ళలో శిశిరాలు రాలుతున్నప్పుడు
ఒక జీవిత నిర్వేదం ఒక జీవిత క్రమం
పాఠాలు చెబుతుంటాయి.
కన్నీళ్ళను బిగపట్టి వసంతాల చిగుళ్ళ కోసం
మనసుతో మాటాడి
కాస్తంత ఊరట పొందటం ఒక అవసరం.
నిశ్శబ్ద ఏకాంతాన్ని నాలో నింపుకొని
కళ్ళ నిండా చెట్ల గాలులు పూసుకొని
ధ్యాన సాగరంలో మునిగిపోతాను.
చుట్టూ ప్రపంచం నుంచీ
వేడి గాలులూ తగులుతుంటాయి.
ఏదీ పూర్తిగా చొరబడనివ్వక
లోలోపల రక్షణ కవచాల్ని
నిర్మించుకుంటాను
బతుకంటే, బతకడమంటే
నిరంతర మూల్యాంకనం లోంచి సరిచూసుకొని
నిత్య నూతనంగా జీవించడమే.
-గవిడి శ్రీనివాస్‌, 7019278368

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img