Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై గోవా సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలు..

అసెంబ్లీలో తీవ్ర దుమారం
గోవాలో ఇద్దరు మైనర్‌ బాలికలు అత్యాచారానికి గురైన ఘటనపై ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్‌ సావంత్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. మరికొద్ది రోజుల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల దాడి మరింత తీవ్ర స్థాయిలో ఉంది. రాత్రిళ్లు అమ్మాయిలు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ ప్రమోద్‌ సావంత్‌ వ్యాఖ్యానించారు. పిల్లలు బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని కూడా వ్యాఖ్యానించారు. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వాన్ని, పోలీసులను మాత్రం ప్రశ్నిస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, ఇతర విపక్ష సభ్యులు మండిపడ్డారు. గోవా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అట్లోనే డీకోస్టా మాట్లాడుతూ ‘‘రాత్రిళ్లు బయటికి వెళ్లాలంటే ఎందుకు భయపడాలి? నేరస్తులను జైల్లలో పెడితే ప్రజలు ఏ సమయంలోనైనా బయట స్వేచ్ఛగా తిరగొచ్చు. కానీ ప్రభుత్వం నేరస్తులకు స్వేచ్ఛనిచ్చి ప్రజలను బంధీ చేస్తోంది’’ అని విమర్శించారు. ఇంకా శివసేన, గోవా ఫార్వర్డ్‌ బ్లాక్‌ వంటి ప్రతిపక్ష సభ్యులు కూడా మొదట రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సజావుగా ఉండేట్టు చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img