Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఉత్తరాఖండ్‌ సీఎంగా ధామి ప్రమాణం

మంత్రులుగా మరో ఎనిమిది మంది
డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ధామితో పాటు ఎనిమిది మంది మంత్రులు రాష్ట్ర గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) గుర్మీత్‌ సింగ్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ధామి (46) రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన క్రమంలో ధామి తిరిగి ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నదానిపై ఊహాగానాలకు సోమవారం వెలువడిన బీజేపీ ప్రకటనతో తెరపడిరది. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆయన మరో ఆరు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలలో సత్పాల్‌ మహారాజ్‌, ధాన్‌ సింగ్‌ రావత్‌, సుభోద్‌ ఉనియల్‌, ప్రేంచంద్‌ అగర్వాల్‌, రేఖా ఆర్య, గణేశ్‌ జోషి, చందన్‌ రామ్‌ దాస్‌, సౌరభ్‌ బహుగుణ ఉన్నారు. మాజీ సీఎం విజయ్‌ బహుగుణ తనయుడు సౌరభ్‌ బహుగుణ, బాగేశ్వర్‌ ఎమ్మెల్యే చందన్‌ రామ్‌దాస్‌, రిషికేశ్‌ శాసనసభ్యుడు ప్రేంచంద్‌ అగర్వాల్‌ మినహా అందరు నాయకులు ధామి గత కేబినెట్‌లో ఉన్న వారే కాగా అగర్వాల్‌ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రవాణా మంత్రి నితిత్‌ గడ్కరీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img