Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒమిక్రాన్‌ సాధారణ జ్వరమే : యోగి ఆదిత్యనాథ్‌

లక్నో : దేశంలో అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ను సాధారణంగా వచ్చే వైరల్‌ జ్వరమేనని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని అన్నారు. 15-18 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్‌-19 టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందనేది నిజం, అయితే కరోనా మహమ్మారి రెండో దశతో పోలిస్తే చాలా బలహీనంగా ఉందనేది కూడా నిజం’ అన్నారు. ఇది సాధారణ వైరల్‌ జ్వరం మాత్రమే అయినా ఏ వ్యాధి నివారణకైనా జాగ్రత్త, చికిత్స అవసరమని యోగి చెప్పారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గతేడాది మార్చి-ఏప్రిల్‌లో కరోనా డెల్టా వైరస్‌ సోకిన వారికి కోలుకోవడానికి 15-25 రోజుల సమయం పట్టిందని, కోలుకున్న తర్వాత కూడా అనేక ఆరోగ్య సమస్యలొచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. వైరస్‌ బలహీనపడిరదని చెప్పారు. అయితే కొన్ని ఇతర వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించిందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు ఎనిమిది ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, రోగులలో ముగ్గురు కోలుకున్నారని, మిగతా వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. 15-18 సంవత్సరాల వయసు పిల్లలకు కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. 1.4 కోట్ల మందికి వాక్సిన్‌ డోసులు వేస్తాం. ఇందుకోసం లక్నోలో 39 సహా రాష్ట్రవ్యాప్తంగా 2,150 ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img