Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాంగ్రెస్‌కు జాకర్‌ షాక్‌

ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన

చండీగఢ్‌ : ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని కాంగ్రెస్‌ పార్టీకి పంజాబ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాకర్‌ షాక్‌ ఇచ్చారు. క్రియాశీల రాజకీయాల నుంచి, ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఐదు రోజులుగా ఇదే మాట చెబుతున్నట్లు లూధియానాలో విలేకరులతో మాట్లాడిన జాకర్‌ తెలిపారు. కాంగ్రెస్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పారు. అమరీందర్‌ సింగ్‌ రాజీనామా తర్వాత తనను సీఎంగా చూడాలని 42 మంది ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు కొద్దిరోజుల కిందట రaాకర్‌ వెల్లడిరచారు. అయితే ఇందుకు తన మతం అడొచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌పై ఆప్‌, బీజేపీ విరుచుకుపడ్డాయి. కులమత రాజకీయాలను కాంగ్రెస్‌ చేస్తోందని దుయ్యబట్టాయి. పురాతన పార్టీ లౌకికత్వం ఇదేనా అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. అమరీందర్‌ నిష్క్రమణతో సీఎం రేసులో ముందున్న నాయకుల్లో జాకర్‌ ఒకరు కాగా ఆయనను కాదని చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ వైపుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఎస్సీ వర్గానికి చెందిన తొలి ముఖ్యమంత్రిగా చన్నీని గద్దె ఎక్కించింది. జాకర్‌ కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ స్పీకర్‌ బలరాం జాకర్‌ తనయుడు. 1954లో అబోహర్‌లోని పంజ్‌కోసి గ్రామంలో జన్మించారు. అదే నియోజకవర్గం నుంచి 2002 నుంచి 2017 వరకు మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అకాలీబీజేపీ హయాంలో పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి చేతిలో అబోహర్‌ స్థానంలో ఓడిపోయారు. అదే ఏడాది సిట్టింగ్‌ ఎంపీ వినోద్‌ ఖన్నా మృతి చెందగా గురుదాస్‌ లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆపై పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత ఆ స్థానం నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూను వరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్‌ స్థానం నుంచి రaాకర్‌ పోటీ చేయగా 82వేలకుపైగా ఓట్లతో నటుడు సన్నీ డియోల్‌ (బీజేపీ) ఆయనను ఓడిరచారు. ఇప్పుడు అబోహర్‌ స్థానం నుంచి జాకర్‌ మేనల్లుడు సందీప్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img