Friday, April 26, 2024
Friday, April 26, 2024

దుమ్కా ఘటనపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ.. మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

జార్ఖండ్‌లోని దుమ్కా ఘటనపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణాన్ని ఖండిరచిన ఆయన.. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడం అత్యంత క్రూరత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దుమ్కా పట్టణంలో షారుక్‌ హుస్సేన్‌ అనే ప్రేమ్మోనాది.. తన ప్రేమను అంగీకరించలేదని అంకితా సింగ్‌ అనే యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ‘‘మహిళకు నిప్పంటించి మృగంలా ప్రవర్తించాడు.. ఘటనను నేను ఖండిరచడమే కాకుండా జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని కూడా ఈ కేసును సక్రమంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాను.. వీలైతే, కేసును విచారించడానికి ప్రత్యేక కోర్టును నియమించాలి.. నిందితుడు చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్షను పొందాలి’’ అని ఒవైసీ పేర్కొన్నారు.అంకితా సింగ్‌ మరణంపై స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుందని భావించిన పోలీసులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు.బాధితురాలు అంకితా సింగ్‌ నిద్రపోతుండగా.. నిందితుడు షారుఖ్‌ కిటికీలో నుంచి పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. దాంతో మంటల్లో ఆమెకు 60 శాతం గాయాలయ్యాయి. కుటుంబసభ్యులను ఆమెను చికిత్స కోసం దుమ్కా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. డాక్టర్లు ఆమెను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్డియోక్‌ అరెస్ట్‌కు గురై ప్రాణం వదిలింది.పోలీసులు నిందితుడు షారుఖ్‌ని ఆగస్ట్‌ 23న అరెస్ట్‌ చేశారు. అంకితా సింగ్‌కు సోమవారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img