Friday, April 26, 2024
Friday, April 26, 2024

నేమింగ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని పిటిషన్‌..! గతాన్ని తవ్వకండన్న సుప్రీంకోర్టు..!

నేమింగ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దేశంలోని చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక ప్రదేశాలకు సంబంధించిన అసలు పేర్లను తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆక్రమణదారుల పేర్లను తొలగించేందుకు నేమింగ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని పిటిషన్‌ కోరారు. పూర్వం ఉన్న పేర్లను ప్రచురించేలా పురావస్తు శాఖను ఆదేశించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖలు చేసింది. దేశంలో ప్రకంపనలు సృష్టించగల సమస్యలను సజీవంగా తీసుకువస్తారా? అని ప్రశ్నించింది. దేశ చరిత్రను ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు భంగం కలిగించరాదని పేర్కొంది. హిందుత్వం అనేది మతం కాదని, ఒక జీవన విధానం అని కోర్టు పేర్కొంది. ఈ మతంలో మతోన్మాదం లేదని, శత్రువులను మాత్రమే సృష్టించే గతాన్ని తవ్వకండి అంటూ వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img