Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రధాని మోదీది రైతు వ్యతిరేక మనస్తత్వం

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ప్రియాంక గాంధీ వాద్రా
న్యూదిల్లీ : లఖింపూర్‌ ఖేరీ ఘటన ఒక ‘హత్యకు ఒక ముందస్తు ప్రణాళిక కుట్ర’ అని సిట్‌ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రైతు వ్యతిరేక మనస్తత్వం కారణంగా మంత్రివర్గం నుంచి హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తొలగించలేదని ఆమె ఆరోపించారు. అక్టోబర్‌లో ఎనిమిది మంది మరణించిన లఖింపూర్‌ ఖేరీ హింసాకాండపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హత్యానేరం కింద హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడితో సహా నిందితులందరిపై విచారణ జరపాలని సిఫార్సు చేసింది. అక్టోబర్‌ 3 ఘటన ఒక ‘హత్యకు కారణమయ్యే ఒక ముందస్తు ప్రణాళిక కుట్ర’ అని సిట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘కోర్టు మందలింపు, ‘సత్యాగ్రహం’ కారణంగా ఇప్పుడు పోలీసులు కూడా కేంద్ర మంత్రి కుమారుడు కుట్రపూరితంగా రైతుల మీదకు తన వాహనాన్ని ఎక్కించి తొక్కించారు’ అని ప్రియాంక గాంధీ హిందీలో ట్వీట్‌ చేశారు. ‘కుట్ర’లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ‘కానీ రైతు వ్యతిరేక మనస్తత్వం కారణంగా నరేంద్రమోదీ జీ మంత్రివర్గం నుంచి ఆయన తొలగించలేదు’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img