Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రయాణికులకు 4.5 లక్షల పరిహారం ఇవ్వనున్న ఐఆర్‌సీటీసీ

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండున్నర గంటలు ఆలస్యమైనందుకు అందులోని మొత్తం 2035 మంది ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ రూ.4.5 లక్షల పరిహారం చెల్లించనుంది. వివరాల్లోకి వెళితే, ఇండియాలో తొలి ప్రైవేటు రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ శని, ఆదివారాల్లో మూడు ట్రిప్పులు కలిపి ఈ రైలు రెండున్నర గంటలు ఆలస్యమైంది. శనివారం భారీ వర్షాల కారణంగా ఢల్లీి రైల్వే స్టేషన్‌లో సిగ్నల్‌ ఫెయిలవడంతో ఈ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యమైంది. ఆదివారం కూడా లక్నో నుంచి ఢల్లీి వెళ్లే ఈ రైలు గంట ఆలస్యంగా నడిచింది.తేజస్‌ రైలు ఒక గంట ఆలస్యమైతే ఒక్కో ప్రయాణికుడికి రూ .100, రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యానికి రూ .250 పరిహారం పొందాలనే నిబంధన ఉంది. ఇప్పుడు శనివారం తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యమైనందుకు అందులోని 1574 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున మొత్తం రూ.3.93 లక్షలు, ఆదివారం ఆలస్యమైనందుకు అందులోని 561 మంది ప్రయాణికులు ఒక్కొక్కరికి రూ.150 చొప్పున ఈ రైలును ఆపరేట్‌ చేస్తున్న ఐఆర్‌సీటీసీ చెల్లిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img