Friday, April 26, 2024
Friday, April 26, 2024

మా అభ్యర్థికి ఓటేయండి

కాంగ్రెస్‌కు కుమారస్వామి విజ్ఞప్తి
బెంగళూరు: లౌకికశక్తులను బలోపేతం చేయడానికిగాను రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీకి జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి గురువారం విజ్ఞప్తి చేశారు. బీజేపీని ఓడిరచడానికి జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతివ్వాల్సిందేనని గట్టిగా కోరారు. వాస్తవంగా కాంగ్రెస్‌ కన్నా తమ పార్టీకే ఎక్కువ ఓట్లు ఉన్నాయని మాజీ సీఎం కుమారస్వామి వరుస ట్వీట్ల ద్వారా వెల్లడిరచారు. ‘రాజ్యసభ ఎన్నికల్లో తమ మొదటి అభ్యర్థిగా కుపేంద్రరెడ్డిని జేడీఎస్‌ రంగంలోకి దించింది. ఆయన పారిశ్రామికవేత్త, సామాజిక ఉద్యమకారుడు, ప్రగతిశీల భావజాలం కలవారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అనుభవం ఉంది. అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇవ్వాల్సింన అవసరం ఉంది. లౌకికశక్తులను పటిష్టవంతం చేయడం కోసం కుపేంద్రరెడ్డికి కాంగ్రెస్‌ మద్దతివ్వాల్సిందే’ అని కుమారస్వామి డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా భవిష్యత్‌ను చరిత్ర, ప్రజలు నిర్ణయిస్తారు. కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా ఈ విషయాన్ని కచ్చితంగా అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నానని కుమారస్వామి పేర్కొన్నారు. కర్ణాటక నుంచి నాలుగో సీటుకు జరుగుతున్న పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సీటును బీజేపీకి దక్కకుండా చేయడానికి కాంగ్రెస్‌, జేడీఎస్‌ చేతులు కలపాల్సి ఉంది. అందులో భాగంగానే కుమారస్వామి కాంగ్రెస్‌ మద్దతు కోరుతున్నారు. ఈ సీటు కోసం ఇప్పటికే కాంగ్రెస్‌, జేడీఎస్‌ చర్చలు జరిపాయి. రెండు పార్టీలు తమ వైఖరులకే కట్టుబడి ఉండటంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. నాలుగో అభ్యర్థిని గెలిపించుకునే బలం కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌కు లేదు. ఏ రెండు పార్టీలు కలిసినా ఆ సీటు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img