Friday, April 26, 2024
Friday, April 26, 2024

మీ సేవలకు దేశం గర్విస్తోంది

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు మోడీ అభినందనలు..
భూకంపం సంభవించిన టర్కీలో మోహరిం చిన భారత సహాయ, విపత్తు నిర్వహణ బృందాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. గత కొన్నేళ్లుగా భారతదేశం స్వయం సమృద్ధిగానే గాక, నిస్వార్థ దేశంగా తన గుర్తింపును బలోపేతం చేసిందని అన్నారు. భూకంప బాధిత టర్కీ నుంచి తిరిగి వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. మీరు మానవాళికి గొప్ప సేవ చేశారు. భారతదేశం గర్వపడేలా చేశారు. మనం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా పరిగ ణిస్తాము. సంక్షోభంలో ఉన్న ఏ సభ్యునికైనా త్వరగా సహాయం చేయడం కర్తవ్యంగా భావిస్తాం భారతదేశం గత కొన్నేళ్లుగా స్వయం సమృద్ధి కలిగిన దేశంగా తన గుర్తింపును బలోపేతం చేసుకుంది. ఇది ఇతర దేశాలకు నిస్వార్థంగా సహాయం చేస్తుందన్నారు. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా మొదట స్పందించేందుకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంద న్నారు. ఫిబ్రవరి 7న భూకంప ప్రభావిత దేశానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించా లన్న ప్రధాని మోడీ ఆదేశాల మేరకు మొత్తం మూడు ఎన్డి%స%ఆర్‌ఎఫ్‌ బృందాలను అక్కడికి పంపారు. భారీ సంఖ్యలో భూకంప బాధిత ప్రజలకు విస్తృతమైన సేవలను అందించడానికి భారత సైన్యం వైద్యబృందం కూడా అక్కడకు చేరుకుంది.

4 వేల మందికి చికిత్స అందించాం..
పారా ఫీల్డ్‌ హాస్పిటల్‌ ద్వారా టర్కీలో సుమారు 4వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ టీమ్‌ తెలిపింది. ఆపరేషన్‌ దోస్త్‌కు వెళ్లిన ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ టీమ్‌ స్వదేశానికి తిరిగి వచ్చింది. ఘజియాబాద్‌ లోని హండన్‌ ఎయిర్‌బేస్‌లో మెడికల్‌ బృందంతో విమానం ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా 60 పారాచూట్‌ ఫీల్డ్‌ హాస్పిటల్‌ కమాండర్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ ఆదర్శ శర్మ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి థ్యాంక్స్‌ తెలిపారు. కేవలం కొన్ని గంటల్లోనే ఫీల్డ్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 4వేల మంది పేషెంట్లకు చికిత్స అందించామని, దాంట్లో మేజర్‌, మైనర్‌ సర్జరీ కేసులున్నాయన్నారు.
భారత్‌కు టర్కీ కృతజ్ఞతలు
ాఆపరేషన్‌ దోస్త్‌్ణ పేరుతో భారత్‌ తమ దేశానికి అండా నిలిచిన భారత్‌కు టర్కీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని టర్కీ అంబాసిడర్‌ ఫిరాత్‌ సునేల్‌ ట్వీట్‌ చేశారు. భారత ప్రభుత్వం మాదిరే.. విశాల హృదయం ఉన్న భారతీయ ప్రజలు కూడా భూకంప ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి చేతులు కలిపారు. మీ విలువైన సహాయానికి మేము నిజంగా అందరినీ అభినందిస్తున్నాము అంటూ సునేల్‌ పేర్కొన్నారు. భారత్‌ నుంచి తరలించిన టన్నుల కొద్దీ సామగ్రికి సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జతచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img