Friday, April 26, 2024
Friday, April 26, 2024

రికార్డు స్థాయిలో ‘టోల్‌’ వసూలు


ఫాస్ట్‌ట్యాగ్‌తో ఏడాదికి 68 శాతం పెరుగుదల
రూ.38 వేల కోట్లకు చేరిక

న్యూదిల్లీ : దేశంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా టోల్‌ వసూళ్లు మార్చిలో రూ.4,095 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంలో ఈ వసూళ్లు రూ.38,084 కోట్లకు చేరుకున్నాయి. క్రితం సంవత్సరం పోల్చితే, ఇది 68 శాతం అధికం. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి వసూళ్లలో బలమైన వృద్ధిని కలిగి ఉంది. అధికారిక సమాచారం ప్రకారం, మార్చిలో 27.041 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌ లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఇది 11 శాతం పెరిగింది. రాష్ట్ర, జాతీయ రహదారులు రెండిరటిలోనూ రహదారుల వినియోగదారుల రుసుము వసూలు కూడా ఒక నెల క్రితం మార్చిలో దాదాపు 13 శాతం పెరిగి రూ.4,095 కోట్లకు చేరుకుంది. మార్చి 2021లో 19.3 కోట్ల లావాదేవీల నుంచి రూ.3,086 కోట్లు వసూలయ్యాయి. మార్చి 2020లో 8.455 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌ లావాదేవీలు జరిగాయి. రహదారులపై వినియోగదారు రుసుము వసూలు చేసే ఎలక్ట్రానిక్‌ విధానం టోల్‌గా రూ.1,421 కోట్లను వసూలు చేశారు. ఫిబ్రవరి 16, 2021 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చేలా కేంద్రం జాతీయ రహదారులపై రుసుము ప్లాజాల వద్ద అన్ని వరుసలను ఫాస్ట్‌ట్యాగ్‌ లేన్‌గా ప్రకటించింది. జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్‌ వసూలు ఇప్పుడు 96.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 964 టోల్‌ ప్లాజాలు ఫాస్ట్‌ట్యాగ్‌ కింద ఉన్నాయి. ‘ఫాస్ట్‌ట్యాగ్‌ లావాదేవీల పెరుగుదల, టోల్‌ పాయింట్ల వసూళ్లు ఆర్థిక కార్యకలాపాలను పెంచే దిశగా ఉన్నాయి. ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే టోల్‌ రేట్లలో 8.4-13 శాతం శ్రేణిలో గణనీయమైన పెంపుతో రానున్న నెలల్లో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది’ అని ఇక్రాకు చెందిన రాజేశ్వర్‌ బుర్లా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img