Friday, April 26, 2024
Friday, April 26, 2024

సన్నగిల్లిన విశ్వాసం..!

కరోనా మహమ్మారితో‘పని’కి కష్టకాలం..
శ్రామిక మహిళలు..యువ నిపుణుల్లో ఆర్థిక అనిశ్చితి
దేశవ్యాప్తంగా పెరిగిన ఉద్యోగ కొరత

న్యూదిల్లీ : కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవనోపాధిని దెబ్బతీసింది. వారిలో ఆందోళనలు సృష్టించింది. ఆర్థికంగా చితికిపోయేలా చేసింది. అన్ని రంగాలపై పెను ప్రభావం చూపి వ్యవస్థలను అతలాకుతలం చేసింది. కొవిడ్‌19 రెండవ దశ అనంతర పరిణామాలలో యువ భారతీయ నిపుణులు, శ్రామిక మహిళలు ఆర్థిక అనిశ్చితికి ఎక్కువగా గురవుతున్నారని ఒక సర్వే తెలిపింది. లింక్డ్‌ఇన్‌ తాజా వర్క్‌ఫోర్స్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. మహమ్మారి రెండవ దశ తరువాత భారతదేశ శ్రామిక మహిళల దుస్థితి మరింత దిగజారినట్లు వెల్లడిరచింది. ఎందుకంటే మహిళా నిపుణులకు సంబంధించి వ్యక్తిగత విశ్వాస సూచిక (ఐసీఐ) స్కోర్లు జూన్‌ మొదట్లో 57 నుండి 49కి పడిపోయాయి. జూన్‌ ఆరంభంలో శ్రామిక పురుషులతో పోలిస్తే 23 శాతం మేర క్షీణించింది. భారత్‌లో ఇటీవల మహమ్మారి శిఖర స్థాయికి చేరడంతో పని అనుభవం, వృత్తిపరమైన సంబంధాల ప్రాముఖ్యతను పెంచింది. ఎందుకంటే మహమ్మారి ఉద్యోగ జీవితంపై చూపే ప్రభావం గురించి యువ నిపుణులు వారి పాత సహచరుల కంటే రెట్టింపు ఆందోళన చెందుతున్నారు. బేబీ బూమర్‌లలో 18 శాతంతో పోల్చితే, దాదాపు 30 శాతం జెన్‌ జెడ్‌ నిపుణులు, 26 శాతం మిలీనియల్స్‌ ఉద్యోగాల కొరతతో బాధపడుతున్నారు. మే 8 నుండి జూన్‌ 4 వరకు 1,891 మంది నిపుణుల స్పందనల ఆధారంగా ఈ సర్వే పేర్కొంది. కాగా 19972015 మధ్య జన్మించినవారిని జెన్‌ జడ్‌ను సూచిస్తుంది. అలాగే 19811994 మధ్య వారిని మిలీనియల్స్‌గా, బేబీ బూమర్లు అంటే 19461964 మధ్య జన్మించిన వారు. ‘కొవిడ్‌ రెండవ దశ నుంచి భారతదేశం నెమ్మదిగా బయటపడటం ప్రారంభమయ్యింది. సంవత్సరానికి పైగా నియామక రేటు ఏప్రిల్‌లో 10 శాతం కనిష్ఠ స్థాయి నుండి మే నెల చివరిలో 35 శాతానికి కోలుకుంటుంది. ఇది మితమైన పునర్జీవనంగా ఉన్నప్పటికీ, శ్రామిక మహిళలు, యువ నిపుణుల విశ్వాస స్థాయిలు ఈ రోజు శ్రామిక శక్తిలో అత్యల్పంగా ఉన్నాయి’ అని లింక్డ్‌ఇన్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ అశుతోష్‌ గుప్తా అన్నారు. ‘పని చేసే పురుషులతో పోలిస్తే రెట్టింపు మంది శ్రామిక మహిళలు ఉద్యోగ లభ్యత గురించి ఆందోళన చెందుతున్నారు. 30 శాతం జెన్‌ జడ్‌ నిపుణులు ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. ఇక స్థానిక(రిమోట్‌ జాబ్స్‌) ఉద్యోగాలు ఆశా కిరణం కావచ్చు. అవసరమైనవి అనేకం అందించడానికి వశ్యత, అవకాశాల పెరుగుదల వారిని తిరిగి శ్రామిక శక్తిలోకి తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయి’ అని గుప్తా చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చి మొదట్లో మహమ్మారి తారస్థాయికి చేరిన తర్వాత భారతదేశ శ్రామిక శక్తి అంతటిలో విశ్వాసం సన్నగిల్లిందని సర్వే పేర్కొంది. ఇది మార్చిలో 58 నుంచి నాలుగు పాయింట్లు క్షీణించి 54కు చేరిందని వివరించింది. భారతదేశ శ్రామిక మహిళలు ఈ రోజు పని చేసే పురుషుల కంటే ఉద్యోగాల లభ్యత, వారి ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌, ఉద్యోగ కోసం కేటాయించిన సమయం గురించి ఆందోళన ఎక్కువగా ఉందని వెల్లడయింది. అలాగే పెరుగుతున్న ఖర్చులు లేదా అప్పుల గురించి ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది. వినోద, డిజైన్‌, మీడియా, కమ్యూనికేషన్స్‌ వంటి సృజనాత్మక పరిశ్రమలకు చెందిన నిపుణులలో విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని, వారు తమ యజమానుల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. అయితే ఆర్థిక వ్యవస్థలోని అనేక భాగాలు క్రమంగా తెరుచుకుంటున్నందున సాఫ్ట్‌వేర్‌, ఐటీ, నెట్‌వర్కింగ్‌ నిపుణులలో తమ సంస్థల భవిష్యత్తు గురించి విశ్వాసం పెరుగుతుందని సర్వే తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img