Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అదెలా అప్రజాస్వామికం?

విపక్షాలపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం
న్యూదిల్లీ : చట్టసభలో అప్రజాస్వామికంగా ప్రవర్తించడాన్ని ఖండిస్తే అప్రజాస్వామిక వైఖరి అని ఎలా అంటారని ప్రతిపక్షాలను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తప్పు చేయడం, దానిని సరిదిద్దుకోవడం మానవ నైజమని, దానిని సమర్థించుకోవడం తగదన్నారు. తమ ప్రవర్తనపై సస్పెండ్‌ అయిన సభ్యుల్లో చింతన లేకపోగా తమపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత సమావేశాల్లో విధేయంగా లేరంటూ శీతాకాల సమావేశాల నుంచి ప్రతిపక్షాలకుచెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సోమవారం సస్పెండ్‌ చేశారు. ఈ సస్పెన్షన్‌ అప్రజాస్వామికమని, విధాన నియమాలకు విరుద్ధమని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న డిమాండుపై వెంకయ్య స్పందిస్తూ ఈ ప్రతిష్ఠంభనను పరిష్కరించాలని అధికార, విపక్షాలకు సూచించారు. నాల్గవ రోజూ రాజ్యసభలో వాయిదాలు కొనసాగాయి. గురువారం ఉదయం లిస్టింగ్‌ పేపర్లను టేబుల్‌పై ఉంచిన వెంటనే 50 నిమిషాలకు సభ వాయిదా పడిరది. దీంతో వెంకయ్య అసహనం వ్యక్తంచేశారు. మూడు రోజులుగా సభ పనిచేసిందే లేదని అన్నారు. సభ్యులను సస్పెండ్‌ చేయడం కొత్తేమీ కాదని, 1962 మొదలు 2010 వరకు 11 సందర్భాల్లో ఇలా జరిగిందని, అలా చేసిన వారంతా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారా? అదే నిజమైతే అలా ఎన్నిసార్లు జరిగింది? అంటూ ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు. సస్పెన్షన్‌ అప్రజాస్వామికమని అంటున్నారేగానీ అందుకు దారితీసిన కారణాలను ప్రస్తావించడం లేదని దుయ్యబట్టారు. సమస్యను పరిష్కరించుకోవాలని, సభను సజావుగా సాగనివ్వాలని ఇరువురు వర్గాలకు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సూచించినట్లు వెంకయ్య వెల్లడిరచారు. ఇదిలావుంటే, రాజ్యసభలో గురువారం ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. కాంగ్రెస్‌ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సాగు చట్టాల వ్యతిరేక పోరులో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.25లోలు చొప్పున నష్టపరిహారం, పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధ హామీ కోసం డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img